
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
అఖిలభారత ఐక్య రైతు సంఘం ( ఏ.ఐ.యు.కే.ఎస్.) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వి. ప్రభాకర్ ఎన్నిక అయ్యారు. ఆగస్టు 25,26 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులు జరిగిన రాష్ట్ర ప్రథమ మహాసభలు కామ్రేడ్.వి. ప్రభాకర్ ను మహాసభల్లో ప్రతినిధులు ఎన్నుకున్నారు. కామ్రేడ్.వి. ప్రభాకర్ విప్లవోద్యమంలో కీలకమైన నేతగా నిలిచారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని సిరికొండ మండలం గడుకూరు నుండి ప్రారంభించారు. ఇక్కడ…… సంవత్సరంలో పెత్తందారులు, దోపిడీ దారులు ప్రజా కంటకులుగా మారి పీడిస్తున్న సమయంలో ఆనాటి సిపిఐ ఎంఎల్ రైతు కూలి సంఘం గా గడ్కోల్ కేంద్రంగా తన విప్లవ జీవితాన్ని ప్రారంభించారు. అమరుడు కామ్రేడ్ డివి. కృష్ణ స్ఫూర్తితో కామ్రేడ్. ప్రభాకర్ విప్లవ రైతంగా పోరాటాల వైపు వచ్చి పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొనసాగుతున్నాడు. జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ లో పసుపు పంట రైతుల సమస్యలపై, ఎర్రజొన్న రైతుల సమస్య లపై అనేక ఉద్యమాలు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందరు. సంయుక్త కిసాన్ కిషన్ మోర్చా (ఎస్. కే. ఎం ) ఉద్యమంతో దేశవ్యాప్త ఉద్యమంతో రైతంగా ఉద్యమాల్లో అగ్రగామిగా నిలిచాడు.కామ్రేడ్. వి. ప్రభాకర్. తన ఉద్యమ పోరాట తత్వాన్ని గుర్తించి సంఘం గుర్తించి విప్లవ రైతుసంఘం అయినా ఏ.ఐ.యు.కే.ఎస్. వి. ప్రభాకర్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవ ఎన్నికున్నారు — బి. దేవరాం ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని ఆర్గుల్ గ్రామానికి చెందిన బి. దేవారం ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. బి. దేవారం ఆర్మూర్ పాత తాలూకా కేంద్రంగా విప్లవొద్యమంలో కీలకంగా పనిచేశారు. ఆర్మూర్ డివిజన్ తో పాటుగా రైతంగా పోరాటల్లో మమేకం అయ్యారు రైతుసంఘానికి చాల కాలంగా జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. దీనితో జిల్లా, రాష్ట్ర రైతంగా పోరాటల్లో వెన్నుగా నిలిచారు. రైతుసంఘాల, రైతు జేఏసి లో ప్రధానపాత్ర పోశించారు. వీరితో పాటు, ఎస్. సురేష్ ను, బి. బాబన్న ను రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఎన్నుకున్నారు.
