Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఐఏఎస్ పి.నరహరి రచించిన “ఓబీసీ పోరుబాట” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఐఏఎస్ పి.నరహరి రచించిన “ఓబీసీ పోరుబాట” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేశారు, వాటి పర్యవసానల గురించి జరగాల్సినంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎందుకు తొలగించారు అనే విషయం మీద కూడా చర్చ జరగలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..ఆర్థికంగా వెనుకబడిన వారిని నిర్దేశించినవి. అంటే ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా ఆ రిజర్వేషన్లల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. విధానాలను నిర్దేశించే వ్యవస్ధలోని విధాన నిర్ణేతల్లో మన వారి ప్రాతినిధ్యం తగినంత లేకపోవడమే ఈ అన్యాయానికి కారణం.• సుప్రీం కోర్టులోని 33 మంది జడ్జిల్లో నలుగురు మాత్రమే ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన వారు. ఎస్టీ వర్గం వారు లేరు. సుప్రీం కోర్టు చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఎస్టీ వర్గానికి చెందిన మాత్రమే జడ్జిగా నియమితులయ్యారు.
• గత ఏడేళ్లుగా దేశవ్యాప్తంగా 715 మంది జడ్జిలను నియమిస్తే అందులో 77 శాతం మంది అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం గమనార్హం.• రిజర్వేషన్ల మీద ఉన్న 50 శాతం క్యాప్ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వర్తించదు అని సుప్రీం కోర్టు ఐదు జడ్జిల్ ధర్మాసనం 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. ఈ ఐదుగురి జడ్జిలో ముగ్గురు బ్రహ్మణులు, ఒకరు బనియా, మరొకరు పార్శీ. ఈ నేపథ్యంలో మనకు న్యాయం ఎలా జరుగుతుంది.• యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఓబీసీలకు రాత పరీక్షలో 900 మార్కులు వస్తే 200 మార్కులున్న ఇంటర్వ్యూలో 120-130 మార్కులు వస్తాయి. అదే అగ్రవర్ణాల వారికి రాత పరీక్షలో 800 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో 200కి 200 మార్కులు వేస్తున్నారు. • విధానాలను రూపొందించే దగ్గర, విధానాలను సమీక్షించే వ్యవస్థలో మన వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతోనే ఈ అన్యాయం జరుగుతుంది. • కామారెడ్డి డిక్లరేషన్లో మేము స్థానిక సంస్థల్లో మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు ఇక్కడ ఉన్న వకుళాభరణం అందరూ కోరితే విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. • ఈ క్రమంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా డెడికేటెడ్ కమిషన్ వేసి, కులగణన చేసి అన్ని నిబంధనలు పాటిస్తూ అందరూ సూచించిన విధంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇది జరిగి నాలుగు నెలలు అవుతుంది. అయినా కేంద్రంలో ఉలుకు పలుకు లేదు.• ప్రభుత్వం 2027లో కులగణన చేస్తా అంటుంది. దానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. రెండేళ్ల తర్వాత కులగణన చేసి, దాన్ని ఎప్పుడూ అమలు చేస్తారో దేవుడికే తెలియాలి. ఇక్కడ మా ప్రభుత్వం ఇక్కడ ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మీరేమో మేము పంపిన బిల్లులను ఆమోదించరు. బీసీల పట్ల కేంద్ర చిత్తశుద్ధి ఇదేనా • కులగణనను రెండేళ్ల తర్వాత చేస్తా అంటున్నారు. దీంతో బీసీలకు ఉద్యోగాల భర్తీలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయి. ఫలితంగా బీసీలకు అన్యాయం జరగదా? 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పుడా అవకాశాన్ని బీసీలు కోల్పోవడం లేదా • ఈ నేపథ్యంలో రెండేళ్లు ఆగుదామా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన బిల్లులను ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేద్దామా? లేదా మనం ఆలోచించాలి. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కంటే సమిష్టగా కేంద్రం మీద పోరాటం చేయాలి.• ఇక్కడ రాజేందర్ అన్న ఉన్నాడు. బీజేపీలో ఆయనే పెద్ద లీడర్. బీసీ రిజర్వేషన్ల బాధ్యతను రాజేందర్ అన్న మీదే మనమందరం పెడదాం. కేంద్రం దగ్గరికి పోదాం. తమిళనాడు మారిదిగా 9వ షెడ్యూల్లో తెలంగాణ ఆమోదించిన బీసీ బిల్లులను ప్రవేశపెడితే ఆర్టికల్ 31 (బి) రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. రాజ్యాంగ రక్షణ ఉంటుంది కాబట్టి కోర్టుల్లో కేసులు వేసిన ఆవి నిలబడవు. ఇందుకోసం కేంద్రం మీద ఒత్తిడి తేద్దాం.• ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 50 శాతం క్యాప్ పరిమితి వర్తించదు. బీసీలకు 15 శాతం అదనంగా రిజర్వేషన్ల కల్పించాలంటే మాత్రం 50 శాతం క్యాప్ పరిమితి అడ్డు వస్తోంది. బీసీల విషయంలో మాత్రం ఈ వివక్ష ఎందుకు • బీసీల్లో ఇప్పటికీ 90 శాతం మంది వెనుకబడి ఉన్నారు. వారు బాగుపడొద్దా. ఈ విషయంలో మనమందరం స్పందించాలి. రాజకీయాలకు అతీతంగా పని చేద్దాం. బీసీల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిద్దాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments