
ఆదివాసి సంక్షేమ పరిషత్ రి.నెం.1483/17.
పయనించే సూర్యుడు: 04మే:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని శనివారం చెరుకూరు గ్రామంలో ఏఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి కుర్సం సుధాకర్ అధ్యక్షనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ వాజేడు మండల అధ్యక్షులు లోడిగ నరసింహారావు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న క్రమంలో అధికార పార్టీ నాయకుల కనుసన్న ల్లో సెలక్షన్ జరగటం వల్ల ఆదివాసి నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ ఇల్లు పేసా గ్రామ సభల ద్వారా జాబితా తయారు చేయాలని కోరారు. అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న క్రమంలో అధికార ఒత్తిళ్లకు, అవక తవకలు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుర్సం సుధాకర్,లోడిగ చిన నరసింహారావు,మడి రవి,పేర పూర్ణచందర్రావు,గట్టుపల్లి సంజయ్, తాటి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.