Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఐ ఐ ఐ టి సీటు సాధించిన విజ్ఞాన్ విద్యార్థిని.

ఐ ఐ ఐ టి సీటు సాధించిన విజ్ఞాన్ విద్యార్థిని.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 22 జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత. 2023-24 విద్యాసంవత్సరం లో 10వ తరగతి 553 మార్కులతో పూర్తి చేసిన జగ్గయ్యపేటలోని విజ్ఞాన్ విద్యాసంస్థ విద్యార్థిని  మూడావతు వెన్నెల ఐ ఐ ఐ టి ఇడుపులపాయ బ్రాంచి లో సీటు సాధించటం ఎంతో గర్వకారమని జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో శాలువా, మెమెంటో మరియు పుష్పగుచ్చంతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు.
స్కూల్ డైరెక్టర్ తన్నీరు సుధారాణి మాట్లాడుతూ ఐ ఐ ఐ టి స్థాపించినప్పటి నుండి మా విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తున్నారని, మా విద్యాసంస్థ ఎన్ సీసీ కలిగి ఉండటం వలన ఇటువంటి ప్రతిష్ఠాత్మక సీట్లు సాధించటం సులువు అవుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments