
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ పట్టణానికి చెందిన పర్సా వసుంధర ఇటీవల వెలువడిన బ్యాంకింగ్ ఫలితాల్లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇండియన్ బ్యాంక్లో క్లర్క్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. కష్టపడి చదివితే ఎంతటి విజయానన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు.