పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 11 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
అనంతసాగరం మండలం పడమటి ఖమ్మంపాడు గ్రామంలోని ఓం శ్రీ ధర్మపల్లెమ్మ దేవి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈనెల 14, 15వ తేదీ జరగనున్నాయి. శనివారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కు నెల్లూరులోని మంత్రి ఆనం నివాసంలో ఓం శ్రీ ధర్మపల్లమ్మ దేవి దేవస్థానము బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కార్యనిర్వాహకులు వేంబులూరి వెంకట రమణయ్య, దియ్యాల రమేష్ నాయుడు, పడమటి ఖమ్మంపాడు మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం నాయకులు వద్దిబోయిన లక్ష్మీరెడ్డి, గౌరవరం గ్రామ సర్పంచ్ శాఖమూరి సుబ్బారావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాతపాటి మధుసూదన్ రెడ్డి అందజేశారు.