
( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్ని కలకు దృష్టిలో పెట్టుకొని ఈనెల 28వ తేదీన ప్రచురించిన ఓటర్ లిస్టు లో వార్డు లను సవరించాలని సిపిఎం పార్టీ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీను నాయక్ ఫరూక్నగర్ మండల పరిషత్ అధికారి ఎంపీడీవో కు వార్డుల సమస్యలు ఇతర సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు శనివారం నాడు అన్ని రాజకీయ పార్టీలతో ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా శ్రీను నాయక్ మరియు ఇతర పార్టీల నాయకులు బి ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. టిడిపి పార్టీ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు కలిసి ఓటరు జాబితా శాస్త్రీయబద్ధంగా లేదని వార్డుల విభజన ఒక క్రమ పద్ధతిలో అమర్చి మ్యాపు వేయాలని మరియు వీటి సవరణకు ఓటర్ లిస్టు గడువుని పెంచాలని ఒకే వార్డులో ఒకే మనిషికి రెండు ఓట్లను తొలగించాలని చనిపోయిన ఓట్లను తొలగించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎంపీడీవోను కోరారు అదే విధంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీను నాయక్ మాట్లాడుతూ ఫరూక్నగర్ మండలంలోని కడియాల కుంట తండా గ్రామంలో
వార్డులు విభజన శాస్త్రీయంగా గ్రామంలో వార్డుల విభజన అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా తమ స్వలాభం కోసం గ్రామంలో తమకు మద్దతిచ్చే ప్రజల ఓటర్ లిస్ట్ ను తయారు చేశారు ఇది సరైన పద్ధతి కాదు ఇట్టి విషయంపై ఉన్నత అధికారులు విచారణ జరిపి గ్రామంలో వార్డుల విభజన పారదర్శకంగా చేయాలని తమరిని కోరుతా ఉన్నాం అదేవిధంగా తండాలు గ్రామపంచాయతీగా ఏర్పడి మొదటిసారి ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా కాబట్టి వార్డుల విభజన సక్రమంగా జరగలేదు కాబట్టి తండాలో ఒకటి రెండు మూడు వార్డులు విభజనలో అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ప్రజల పేర్లే ఓటరు లిస్టు గా మారింది అదేవిధంగా ఒక వ్యక్తికి ఒకే గ్రామంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు మూడు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది కానీ గ్రామంలో వార్డుల విభజన సక్రమంగా చేయలేదు కాబట్టి షాద్నగర్ నియోజకవర్గం లో తండాలు గ్రామపంచాయతీ అయిన తండాలలో వార్డులు విభజన రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు బిఎల్ఓ సహకారంతో పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తమరిని మనవి చేస్తున్నాం
