Wednesday, January 29, 2025
Homeఆంధ్రప్రదేశ్ఓల్డ్ బోయిన్పల్లి కార్పోరేటర్ తో కలిసి శ్మశాన వాటికలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఓల్డ్ బోయిన్పల్లి కార్పోరేటర్ తో కలిసి శ్మశాన వాటికలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 27 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో హస్మత్ పెట్ లోని శ్మశాన వాటిక మరియు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో పలు శ్మశాన వాటిక లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది శ్మశాన వాటిక లో కొత్త బోర్లు, మంచి నీటి సదుపాయము , వాటర్ ట్యాంకులు, కాంపౌండ్ వాల్స్, స్ట్రీట్ లైట్లు మరియు రోడ్లు, ఆర్చ్, బర్నింగ్ ఫ్లాట్ ఫామ్, టాయిలెట్స్ తదితర సమస్యలు పై స్థానికులు కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని శ్మశాన వాటిక టెండర్లు మంజూరు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన ఈ టెండర్లకు పనులు జరగలేదు అని కావున స్మశాన వాటికలు పలు సమస్యలు వీలైనంత త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ భాయ్ డివిజన్ జనరల్ సెక్రెటరీ మేకల హరినాథ్, సయ్యద్ ఎజాజ్ భాయ్, రాజు భాయ్, జంగయ్య, నర్సింగ్ రావు, బాలరాజు, పిట్ల కదిరి, మట్టి శీను, రాజు గౌడ్, అశోక్, గుడి రాజు, సత్తన్న, నాగేష్, శివ అరుణ్ శ్రీనివాస్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments