
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధిఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ పేద విద్యార్థినికి సాయం అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు కంచికచర్ల ఆర్యవైశ్యులు. పేదరికం చదువుకు ఆటంకం కలగకూడదన్న సదుద్దేశంతో తమవంతు సాయం అందించి ఆవిద్యార్థినికి మేమున్నామంటూ భరోసాఇచ్చి ఆదుకున్నారు. నందిగామ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన కూరపాటి జోగయ్య కుమార్తె సాయి ప్రసన్న చెన్నైలోని భారత్ యూనివర్సిటీ లో బీటెక్ చదువుతున్నది. వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న కంచికచర్ల ఆర్యవైశ్య సోదరులు ఆర్థికంగా ఆ విద్యార్థినిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్యవైశ్యులందరూ 23,516 రూపాయలు సేకరించి కంచికచర్ల లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో, కంచికచర్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తండ్రి కూరపాటి జోగయ్య కి అందజేశారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.