ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడుప్రతి నీధి.తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218 జయంతి వేడుకలను పురస్కరించుకుని కంచికచర్ల లోని వడ్డే ఓబన్న విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ ఓర్సు నరసింహారావు, మాజీ ఎంపీటీసీ ఒంటిపులి ప్రసాద్, మాజీ వార్డ్ మెంబర్ వల్లేపు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ.. వడ్డెర ఓబన్న జయంతి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిమాణం అని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా వడ్డెర కుల చిరకాల పోరాటం, కోరిక అయినటువంటి “ఎస్టీ రిజర్వేషన్” డిమాండ్ ను ఎన్డీఏ కూటమి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా వడ్డెర కులాన్ని ఎస్టి జాబితాలో చేర్చాలని, అదేవిధంగా వడ్డేర్ల ను అన్నివిధాలుగా ఆదుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కోరుకుంటున్నాం అన్నారు.
నందిగామ నియోజకవర్గ వడ్డేర్లకు వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతల చంద్రకళ, ఉప్పతళ్ళ అప్పారావు, ఓర్సు రాజేష్, వేముల గురవయ్య, ఒంటిపులి బాబు, ఉప్పతల్ల నరసింహారావు, పదిర్ల శివాజీ, చింతల జమలయ్య, అచ్చి గోపి, తదితరులు పాల్గొన్నారు.