
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ ముడు న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. ఈనెల పదహారు తారీకు లోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీ లించి నివేదిక సమర్పించా లని కేంద్ర సాధికార కమిటీ సీఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇవాళ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేప థ్యంలో సీఎస్ శాంతి కుమారి,సహా పలువురు అధికారులు మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలు చేసిన నివేదికను పరిశీలిం చిన తరువాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ గతవారం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ భూములను పరిశీలించి వెళ్లింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి కూడా రెండు రోజులు ముందుగానే అఫిడవిట్ దాఖలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావనీ, ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ఆ భూములకు ఎలాంటి కంచలేదనీ, కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయ త్నం చేశామని ఈ భూము ల్లో ఎలాంటి జంతువులు లేవని తెలిపింది. ఈ భూముల్లోనే యూనివర్శిటీ, మరికొన్ని ఇనిస్టిట్యూట్ లు, బస్ స్టాండులు, ఇలా ఎన్నో వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో సుప్రీంకోర్టు తెలిపింది. సుమారు ఇరవై ఏళ్లకుపైగా నాలుగు వందల ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున, అక్కడ చెట్లు మొలిచా యని, కంచ గచ్చిబౌలి భూములు అటవీ శాఖకు గాని హెచ్సీ యూకు గాని ఎటువంటి సంబంధం లేదని, భూమి రెవిన్యూ రికార్డుల్లోనే ఉందని, అటవీ శాఖ రికార్డుల్లో లేదని అఫిడవిట్ లో ప్రభుత్వం తెలిపింది. నిబంధనల ప్రకారమే చెట్లను తొలగించామని, చట్టాలకు లోబడే వ్యవహరించాని, అక్కడ అనుమతి తీసుకొని తొల గించాల్సిన చెట్ల సంఖ్య పదుల్లోనే ఉన్నాయని, వాటిని తొలగించలేదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది.