
పయనించే సూర్యుడు ఏప్రిల్1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది, ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటిం చాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల అంశం ప్రస్తుతం రాజకీయ టర్న్ తీసుకుంది. ఈ భూములు ప్రభుత్వా నివేనని టీజీఐఐసీ సోమ వారం ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీయూలో సర్వే నిర్వహించలేదని ఆ సంస్థ రిజిస్ట్రార్ ప్రకటించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ నాలుగు వందల ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఈ భూమిపై న్యాయపోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసు కున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే ఈ భూమితో హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హెచ్ సీ యూలోని విద్యార్ధి సంఘాలు కూడా ఈ భూ మల విక్రయాన్న నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.