పయనించేసూర్యుడు జనవరి 12 కంభం రిపోర్టర్ కె ఆనందబాబు (మైఖేల్)
కంభం: ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని సాధునియా వీధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి సమయంలో అనుమానంతో భర్త శివ రంగయ్య భార్య అంజలిపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని సీఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున తెలిపారు.
కంభంలో దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
RELATED ARTICLES