
గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న తండా ప్రజలు
మాజీ సర్పంచి బుజ్జి రాజు నాయక్ చొరవతో తీరనున్న కష్టాలు
షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న కరెంటు కష్టాలు నేటితో తీరనున్నాయి. కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజి రాజు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని కరెంటు వైర్లను పునరుద్ధరించడం జరిగింది. తండాలో ఉన్న కరెంటు బుడ్లను వేరువేరు చేస్తూ లైన్లను పునరుద్ధరించడం జరిగింది. దీంతో కరెంటు కష్టాలు నేటితో తీరుతున్నాయని తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరెంటు సిబ్బందితోపాటు తాండ మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ తావ్సింగ్ రెడ్యా నాయక్, సేవ్య, బొక్కో ,శంకర్,రమేష్ రాథోడ్ ,మోహన్, పిర్య తదితరులు పాల్గొన్నారు.
