
కడియాల కుంట గ్రామంలో అర్థరాత్రి చెలరేగిన దొంగలు.. ఒక్క రాత్రి లో దాదాపు 10 బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు చోరీ..
లబోదిబోమంటున్నా రైతులు.
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలో కడియాల కుంట గ్రామంలో దొంగలు పెద్ద ఎత్తున కేబుల్ వైర్ల చోరీకి పాల్పడ్డారు.ఒక్క రాత్రిలోనే దాదాపు 10 బోరు బావుల వద్ద, కేబుల్ వైర్లను దోచుకున్నారు. ఉదయాన్నే బోరు బావులు వద్దకు వెళ్లిన రైతులు లోబోదిబోమంటూన్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వరకు బోరు బావుల వద్ద వ్యవసాయ పనులు చేసుకుని తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. అయితే అర్థరాత్రి కేబుల్ వైర్ల చోరీ దాదాపు 10 బోరు బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీకి పాల్పడ్డారు. ప్రతి బోరుబావు వద్ద స్టార్టర్ లోని కేబుల్ వైర్లు కత్తిరించి అత్యంత చాకచక్యంగా భూమి లోపలి కేబుల్ బయటకు తీసి, పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. బహిరంగ మార్కెట్లో కేబుల్ వైర్ ఒక మీటరు రూ. 100-120 ధర ఉంది. చోరీ అయిన కేబుల్ వైర్ల విలువ యాభై వేల రూపాయలు రైతులకు నష్టం వాటిలిందని వాపోయారు. అర్ధరాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పోలీసుల నిఘా కూడా ఉండాలని కడియాల కుంట గ్రామ రైతులు కోరుతున్నారు..