
ఆటపాటలతో అలరించిన బంజర మహిళలు
( పయనించే సూర్యుడు జూలై 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాలకుంట తండాలో ఈరోజు బోనాల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాండకు చెందిన గిరిజన మహిళలు తమ యొక్క బంజారా డ్రస్సులతో బోనాలు ఎత్తుకొని బంజారా డాన్స్లతో పాటలు పాడుకుంటూ సేవాలాల్ ,మేరామా యాడి గుడి వరకు వెళ్లారు. అనంతరం సేవాలాల్ బాపుకి భోగ్ బండారు సమర్పించిన అనంతరం మేరామా యాడికి బోనాలు సమర్పించారు. తండ ప్రజలను సుఖసంతోషాలతో తోపాటు పాడిపంటల్లో తమకు తోడు నీడై ఉండాలని ఆ దేవుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మాజీ డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్ మాజీ వార్డ్ నెంబర్ తవ్ సింగ్, పీర్య నాయక్, సేవ్యా నాయక్, రాంచందర్ నాయక్, శంకర్ నాయక్, మోహన్ నాయక్, రెడ్యా నాయక్, రాజు, రమేష్, శ్రీను గ్రామ పెద్దలు యువకులు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
