
డిప్యూటీ ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేసిన గిరిజన సంఘాల నేతలు
( పయనించే సూర్యుడు జూలై 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రభుత్వం కేటాయించిన “బంజార భవన్” భూమిని ఆక్రమణ నుండి కాపాడి హద్దు బందులు చూపించాలని కోరుతూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఫరూక్నగర్ మండల డిప్యూటీ ఎమ్మార్వో ఆనంద్ సింగ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎల్ ఎస్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంగులాల్ నాయక్ గిరిజన ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ శీను నాయక్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు బాలు నాయక్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు శ్రీను నాయక్ తదితరులు మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గంలోనీ ఫరూక్నగర్ మండల పరిధిలోని గుండ్లకుంట గ్రామ రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 12/P ఒక ఎకరా ప్రభుత్వ భూమిని తేదీ 03-8- 2023 జీవో నెంబర్ NIT NO SE/TW/176/2023-24 ద్వారా బంజారా భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడంతోపాటు నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు అంచనా వేసి కేటాయించడం జరిగిందని అట్టి భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడం జరిగిందని కావున బంజారా భవన్ భూమిని కబ్జా నుంచి కాపాడి బంజారా భవన్ నిర్మాణం కోసం హద్దు బందులు చూపించాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నామని వారు అన్నారు లేని పక్షంలో గిరిజనులందుని ఏకం చేసి కబ్జా నుంచి తిరిగి తీసుకునే విధంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు.
