
{పయనించే సూర్యుడు} {నవంబర్ 1}మక్తల్
పట్టణ మున్సిపల్ కమిషనర్ ప్రజల ఆరోగ్యం, స్వచ్చత పై బాధ్యత వహిస్తూ డ్రైనేజ్ పనులు ప్రణాళికతో చేయాల్సిన అవసరం ఉంది. కొత్త డ్రైనేజ్ పైప్ రూట్ లో ప్రజలకు అసౌకర్యం కలిగితే దానిని వెంటనే సరిచేయటం వారి బాధ్యత..ప్రజలు చేసిన కంప్లయింట్స్‌కు సమాధానాలు ఇవ్వడం, ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారిగా కమిషనర్ బాధ్యత.పాత పైప్ లైన్ ఉన్నప్పుడు, కొత్త లైన్ ఇళ్ల మధ్యలో వదిలిపెట్టి, పర్యవేక్షణ లేకుండా ఉండటం గ్రహించాల్సిన అంశం.. మాజీ కౌన్సిలర్ కు, కాలనీ వాసులు కొంతమందికి కమిషనర్ చెప్పిన మాట సరే పాత పైప్ లైన్ ప్లేస్ లోనే మళ్లీ కొత్త పైపులు అక్కడే ఇస్తామని మాటిచ్చాడు. ఆరోజు మున్సిపల్ కమిషనర్ వాళ్లకి ఇచ్చిన మాటని కాదని ఈరోజు ఎవరి మెప్పుకోసం ఇంత తొందర తొందరగా పని చేయవలసి వస్తుంది..? ఇన్ని రోజులు అంత నిర్లక్ష్యంగా వదిలేసిన పని ఇప్పుడు ఎందుకు ప్రజలు వద్దన్న పనిని చేస్తున్నారో మున్సిపల్ కమిషనర్ కే తెలియాలి..
