
పయనించే సూర్యుడు గాంధారి 26/03/25 గాంధారి మండల కేంద్రం లో మంగళవారం రోజు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం లో కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆఫీసర్ హరికృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేసినట్లు ఆయన పేర్కొన్నారు .తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు జిల్లా ఆసుపత్రి సిపారసు చేశామన్నారు.దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు కంటి అద్దాలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు