
అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్
//పయనించే సూర్యుడు// జులై 13//మక్తల్
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో ఈరోజు మక్తల్ పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ నిమిత్తం మక్తల్ లోని మూడవ వార్డుకు వచ్చిన గౌరవ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమలు మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి కి కేశవనగర్ కమ్యూనిటీ హాల్ మరియు 1వ నెం.అంగన్వాడి సెంటర్ లకు కొత్త భవనాలను నిర్మించాలని వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పృధ్విరాజ్ గారు మాట్లాడుతూ దళిత,బహుజన ప్రజల విద్య,సామాజిక చైతన్య కార్యక్రమాలకు చిరునామాగా నిలిచిన కేశవ్ నగర్ కమ్యూనిటీ హాల్ 1981లో ప్రభుత్వంచే నిర్మించబడిందని, కమ్యూనిటీ హాల్ భవనంలో కేశవ్ నగర్ ప్రాంతానికి చెందిన ఎంతోమంది విద్యావంతులు వయోజన విద్యను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అక్షరాల ఓనమాలు నేర్పించడంతో మొదలుకొని రాజకీయ, సామాజిక, దళిత బహుజన ప్రజల పోరాటాల ఆవశ్యకత,అవగాహనను ప్రజలకు అందించనారని, వారందరు నేడు విద్య,రాజకీయ,సామాజిక రంగాలలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారాన్నారు.అంతటి ప్రత్యేకత కలిగిన కేశవ నగర్ కమ్యూనిటీ హాల్ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని కాబట్టి ప్రత్యేక చొరవతో ఆధునిక వసతులతో కొత్త కమ్యూనిటీ భవనంను నిర్మించాలని గౌరవ మంత్రి డా.వాకిటి శ్రీహరి కి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మక్తల్ పట్టణ కేంద్రంలోని మూడో వార్డులోని 1వ నెంబర్ అంగన్వాడి సెంటర్ కు సొంత భవనం లేకపోవడంతో చాలా కాలంగా రెంట్ రూములలో నడుస్తున్నదన్నారు. సరైన వంటగది,తరగతిగది,బాత్రూం వంటివి సౌకర్యాలు ఒకటి ఉంటే ఇంకొకటి ఉండని రెంటు రూముల్లో పిల్లలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారాన్నారు.దీంతో తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను అంగన్వాడికి పంపించలేకపోతున్నారు. దీనితో పిల్లలు సరైన పౌష్టిక ఆహారాన్ని పొందలేక పోవడమే కాకుండా పూర్వ ప్రాథమిక విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి, ఆధునిక వసతులతో మూడో వార్డులో అంగన్వాడి సెంటర్ కు సొంత భవనాన్ని నిర్మించాలని మంత్రి ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ బండారి,సహాయ కార్యదర్శి రవికుమార్, కోశాధికారి త్రిమూర్తి, తల్వార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.