
పయనించే సూర్యుడు న్యూస్ మే 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈరోజు సమావేశమయ్యా రు. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు. యాబై పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్ ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన యాబై కి పైగా డ్రోన్ల ను భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉధంపూర్, జమ్ము, నగ్రోటా, అఖ్నూర్, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా, వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేవేసింది. భారత దెబ్బ మామూలుగా లేదు పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ పాకిస్తాన్‌లో ఎడు కీలక ప్రాం తాలపై ఈరోజు తెల్లవారు జామున దాడులకు దిగింది భారత్. కరాచీ, ఇస్లామా బాద్, పెషావర్, లాహోర్ లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం తో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి. కరాచీని ప్రత్యేకంగా టార్గెట్‌గా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అందుకే పాకిస్తాన్‌కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది.ఇప్పుడే కాదు 1971లోనూ కరాచీ టార్గెట్‌గా దాడులు జరిగాయి.
1971 డిసెంబర్ నాలుగు న అత్యంత సాహాసోపేతమైన దాడులకు దిగింది భారత్, దీన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. అప్పట్లో ఐ యస్ యస్ నిపట్, ఐ యన్ యస్ నిర్ఘాత్ క్షిపణి పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్.ఈ క్రమంలోనే డిసెంబర్ నాలుగు న నేవీ డేగా జరుపు తుంది భారత్. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్లీ ఇప్పుడే దాడి చేసింది.