
అంతర్జాతీయ స్థాయి కరాటే లో గెలుపొందిన హరీష్
ఇండియన్ హైట్స్ స్కూల్ యజమాన్యం నగదు బహుమతి అందచేత
( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇండియన్ హైట్స్ స్కూల్ లో చదువుతున్న హరీష్ ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించడం జరిగింది. హరీష్ పాల్గొన్న కుమితే మరియు కటాస్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం జరిగింది. దీంతో ఇండియన్ హైట్స్ స్కూల్ యాజమాన్యం హరీష్ కి 5000 రూపాయలు నగదు బహుమతిని అందించడం జరిగింది. ఇండియన్ హైట్స్ స్కూల్ చైర్మన్ భువనేశ్వర్ మరియు దాక్షాయిని చేతుల మీదుగా విద్యార్థికి నగదు బహుమతి అందించడం జరిగింది. విద్యార్థులు చదువుతోపాటు కరాటే లో కూడా రాణించాలని, కరాటే వల్ల శారీరకంగా మానసికంగా విద్యార్థు లు దృఢంగా తయారవుతారని అందువలన విద్యార్థులకు కరాటే లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ భువనేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ సాయినాథ యాదవ్, ఉత్తేజ్, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
