
పయనించే సూర్యుడు మార్చి 24 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం కేంద్రంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ డిమాండ్ చేశారు -. ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుతును నిరంతరాయంగా సరపర చేయాలి. -.ఎండిపోయిన పంటలకు ఎకరాల 30000 నష్ట పరిహారం ఇవ్వాలి. -. అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్. భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగాన్నీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుతును నిరంతరాయంగా సరపర చేయాసివ్యవసాయపంటలను కాపాడాలని,* ఎండిపోయిన పంటలకు ఎకరాల 30000 నష్ట పరిహారం ఇవ్వాలని -. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు సోమవారం నాడు భీంగల్ మండలంలోని గంగారాయి, దేవక్కపేట్, రాంచందర్ పల్లె, తాళ్లపల్లి, దేవన్ పల్లి, రహత్ నగర్ తదితర గ్రామాల్లో కరెంట్ కోతలతో ఎండిపోయిన పంటలను -. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ తమ సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుందని ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చెప్పేదానికి చేసే దానికి చాలా తేడా ఉందన్నారు. వాస్తవంగా భూగర్భ జలాలు తగ్గిపోయి అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న భీమిగల్ మండలంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ‘దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడు’ అన్నట్టుగా పరిస్థితి దాపురించిందన్నారు. భీంగల్ మండలంలో ముఖ్యంగా గిరిజన గ్రామాల తో పాటు అనేక గ్రామాల్లో వ్యవసాయ పంటలు భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతల వల్ల ఎండిపోయాయన్నారు. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది అన్నారు. సుమారుగా 15వెల ఎకరాల్లో ఎకరాల వరి పంట పొలాలు పొట్ట దాశలో, కాయగాసే సమయంలో ఎండి పోవడంతో రైతులు లబో, దిభోమంటున్నారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపోయే రైతాంగాన్ని ఆదుకొని, నష్టయ పరిహారం అందించాలన్నారు. ఎకరానికి 30 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతాంగం అంత పెద్ద ఎత్తున ఆంధ్రలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బి. దేవరాం, సీపీఐ(ఎం.ఎల్.) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ , జిల్లా నాయకులు కే. రాజేశ్వర్, ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, మదన్ లాల్ తదితర రైతులు పాల్గొన్నారు.
