
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 15 అల్లూరి సీతారామరాజు జిల్లా
కూనవరం మండలం పెద్దార్కుర్ పంచాయతీలోని గండి కొత్తగూడెం గ్రామానికి చెందిన తెల్లం వెంకయ్య ఇల్లు గత నెల జూన్ లో పూర్తిగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది స్వచ్ఛంద సంస్థల వారు ఆయుర్వేద డాక్టర్ జమల్కాన్ ఆ కుటుంబానికి 10 రేకులు 10 రాడ్లు ఆర్థికంగా సహాయం చేశారు మరియు కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వారు కూడా ఆ కుటుంబానికి తమ వంతు తోచిన సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వంతుగా ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఇందులో భాగంగా కూనవరం సిపిఎం పార్టీ శాఖ రేపాక శాఖ నుండి వారికి తోచిన సహాయాన్ని చేయడం జరిగింది కనీసం స్వచ్ఛంద సంస్థలు స్పందించినట్లుగా ప్రభుత్వం 25 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధాకరం పూర్తిగా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం నష్టపోయింది.ప్రభుత్వమే నష్టపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి త్వరగా హౌసింగ్ పక్కా ఇల్లు మంజూరు చేసి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయవలసిందిగా పెద్దార్కుర్ సర్పంచ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ కుటుంబాన్ని సందర్శించినటువంటి సిపిఎం పార్టీ నాయకులు మేకల నాగేశ్వరరావు మండల కార్యదర్శి బాబు బోరయ్య మనలా కమిటీ సభ్యులు పోడియం రామారావు తెల్లం తమ్మయ్య మడకం సత్యనారాయణ తొండ లక్ష్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.