
పయనించే సూర్యుడు// న్యూస్ మే17// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్//
నారాయణపేట జిల్లా తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు అయినా ఎగ్లాస్పూర్ గ్రామ సమీపంలో శనివారము మధ్యాహ్నము రోడ్డు ప్రమాదం జరిగినది ఈ ప్రమాదంలో నారాయణపేట జిల్లా కుమ్మరి వాడకు చెందిన శిరీష (10), కర్ణాటక రాష్ట్రం సిపురంకు చెందిన హనుమంతి (50) మృతి చెందారు నారాయణపేట జిల్లా మార్గం నుంచి కర్ణాటక వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు గాజల్ కోట్రికే నుండి సుమారు 6 మంది ప్రయాణికులతో నారాయణపేట వైపు కు వస్తున్న జీపు రోడ్డు మలుపు వద్ద ఢీకొనడంతో జీపులో ఉన్న శిరీష మరియు హనుమంతి ఇద్దరూ మృతి చెందారు సమాచారం అందుకున్న నారాయణపేట జిల్లా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మృతదేహాలను నారాయణపేట జిల్లా జనరల్ ఆసుపత్రి లోని మరుచూరి కి తరలించారు