ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.’ అని ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

