
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్.
పయనించే సూర్యుడు: జులై 04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
నూగూరు వెంకటాపురం; ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి చెందిన కలిపాక గ్రామ పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన రోజునుండి ఉపాధ్యాయులు లేరని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్ అన్నారు.గతంలో కలిపాక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే అలుబాక కేంద్రంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించే వరకు పోరాటం చేసామనీ గుర్తు చేశారు.మళ్లీ విద్యార్థులకు ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొందనీ అన్నారు.కలిపాక పాఠశాల కి ఉపాధ్యాయులను నియమించకపోతే,ఆ పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కలిపాక ఏరియా నుంచి ఐటీడీఏ ఏటూరు నాగారం వరకు పాదయాత్రతో వచ్చి ఐటీడీఏ ముట్టడిస్తామని విద్యార్థులకు ఉపాధ్యాయులను నియమించేవరకు పోరాటాలు ఆపమని, అవసరమైతే పోరాటం ఉదృతం చేస్తామని తెలియజేశారు.కలిపాక పాఠశాల కి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.గతంలో మాదిరిగానే అధికారులు ఉపాధ్యయులను నియమంచకుండా ఉంటే ఉద్యమాల ఆపమని ఒక ప్రకటనలో హెచ్చరించారు.