
ప్రతిభ పురస్కారాలు అందుకున్న విద్యార్థులు
పయనించే సూర్యుడు జూన్ 10( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నెల్లూరు కస్తూరి దేవి గార్డెన్స్ లో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల వేడుక సోమవారం ఘనంగా నిర్వహించారు . చేజర్ల మండలం లుంబిని విద్యార్థులు 1.షేక్.ఆఫ్రిన్ తాజ్ 2. యం.లహరి 3.యు.అనూష 4.వి.వి.సాయి చరణ్ 5. యన్.నిఖిత 6. యం. సాయిరోహిత 7 యం. విద్యాస్వరూపిణి .20000/- నగదు మెమెంటోలు జిల్లా కలెక్టరు . విద్యాశాఖాధికారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు . సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు హర్షం వ్యక్తంచేశారు.పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు యం.పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,కోవూరు యం.యల్. ఎ.వేమిరెడ్డీ ప్రశాంతి రెడ్డి . కావలి యం యల్. ఎ. కావ్యకృష్ణారెడ్డి లు పాల్గొన్నారు. చేజర్ల లుంబిని యాజమాన్యం, కరస్పాండెంట్ రామయ్య. అధ్యాపకులు. విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
