
పయనించే సూర్యుడు// న్యూస్ మే 26// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో మంజూరైనటువంటి. మహాత్మ జ్యోతిరావు పూలే. వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల నిర్మాణం చేయుట కొరకు గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో సర్వేనెంబర్ 40/2 జాండ్ర గుట్ట దగ్గర అప్పటి జిల్లా కలెక్టర్ చే ఐదు ఎకరాలను ప్రోసిడింగ్ నెంబర్ E2/1835/2023 date 21/8/2023 నాడు ప్రభుత్వంచే మంజూరు చేసి స్థలం ఇవ్వనైనది. దీనికి గాను 30/11/2021 నాడు నర్వ గ్రామపంచాయతీ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి బాలికల పాఠశాను జాండ్ర గుట్ట దగ్గరనేనిర్మాణం చేయాలని తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు ఇట్టి స్థలమును జూనియర్ కళాశాలకు కేటాయించడం జరిగింది. ఇట్టి బాలికల స్కూల్ లంకల శివారులో సర్వేనెంబర్ 330 దగ్గర కేటాయించారు. ఇట్టి బాలికల పాఠశాల నర్వా మండల కేంద్రంలో ఉంటేనే బాలికలకు రక్షణగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాము.కనుక ఇట్టి పాఠశాలను మొదట కేటాయించిన నర్వ మండల కేంద్రంలోని జాండ్రగుట్ట దగ్గరనే చేపట్టాలని నర్వ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ను కలిసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై మన శాసనసభ్యులు. డాక్టర్ వాకిటీ.శ్రీహరి మళ్లీ పున రాలోచన చేసి ఇట్టి బాలికల పాఠశాలను నర్వ శివారులోనే నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము. నర్వ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వి మహేశ్వర్ రెడ్డి