
సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పీ రమేష్..
రుద్రూర్, మే 07 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బుధవారం మారకద్రవ్యాలను, కల్తీ కల్లు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డిఎస్పీ రమేష్ మాట్లాడుతూ..కల్తీ కల్లు సేవించడం వలన అనారోగ్యల భారిన పడతారని అన్నారు. యువత గంజాయి, కల్తీ కల్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థినీలకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణ, ఎస్సై సాయన్న, ఏఎసై రాజు, పంచాయతీ సెక్రటరీ గంగాధర్, హెల్త్ సూపర్ వైజర్ రవి, రైడ్స్ సభ్యులు, విద్యార్థినీలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.