
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 9 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆదేశాలనుసారం ఈరోజు హైదర్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగం శ్రీకాంత్, వెంకటేష్ యాదవ్ ,షేక్ షరీఫ్ , ఎండి కలీం తో కలిసి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు బాధితులని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నిమ్స్ వైద్యులతో మాట్లాడగా వారు 25 మంది ఐసీయూలో అడ్మిట్ ఉన్నారని వారి పరిస్థితి నిలకడగా ఉందని, కాకపోతే క్రియాటిన్ లెవెల్స్ 4 నుంచి 6 మధ్యలో ఉండటం ఆందోళనకరమని ఇద్దరికీ డయాలసిస్ జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ కేవలం మెరుగైన వైద్యం మాత్రమే కాదు బాధిత కుటుంబాలకి ,చనిపోయిన వారి కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ఇందుకు కారణమైనటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంత మాత్రమే కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ కానీ వారు అనేకులు ఉన్నారని, అలాంటి వారిలో ఇంట్లోనే మరణించిన హైదర్ నగర్ స్వరూప కూడా ఒకరని ఆయన తెలియజేశారు.
