
పయనించే సూర్యడు // మార్చ్ // 8 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. కల్వల ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంత రైతుల ప్రయోజనార్థం పంటలు చివరి దశలో ఉన్నందున ఎస్కేప్ గేటు ద్వారా నీటిని విడుదల చేయాలనీ కల్వల ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రాంత రైతులు యువ నాయకుడు, కొమ్మిడి రాకేష్ రెడ్డి దృష్టికి తెలియజేశారు. రాకేష్ రెడ్డి వెనువెంటనే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీఇన్చార్జి వోడితల ప్రనవ్ బాబు కీ పోన్ చేశి మాట్లాడారు. ప్రణవ్ బాబు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎస్కేప్ గేట్ ద్వారా నీరు విడుదల చేయాలి అని ప్రణవ్ బాబు, అధికారులకు తెలియజేసారు. వెంటనే ఏస్కెప్ గేటు ద్వారా నీటిని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు శ్రీపతి రెడ్డి, సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నల్ల కొండల్ రెడ్డి, సంపత్ రెడ్డి, సతీష్ కుమార్, మద్దుల ప్రశాంత్, గట్టయ్య, మిరియాల సమ్మన్న, సమ్మిరెడ్డి, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
