
సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ టీ. వీ. రంగయ్య
( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
రెండు రోజుల పాటు మహబూబ్నగర్ టౌన్ హాల్ లో మిత్ర కళా నాట్య మండలి వారిఆధ్వర్యంలో నాటికలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ,రెండవ రోజు కార్యక్రమాలలో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన
మాకూ స్వాతంత్య్రం కావాలి షాద్ నగర్. బాలల నాటిక సాంప్రదాయ కళలైన సంగీత సాహిత్యం నృత్యం నాటకం మొదలగునవి మన జాతి సంపడని మన ఆస్తులను అంతస్థులను మన పిల్లలకు వారసత్వంగా ఎలా అందిస్తామో అలాగే మన కళలను సాంప్రదాయాలను వారసత్వంగా అందించాలని. సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు టీ. వీ. రంగయ్య అన్నారు.
శ్రీ మిత్ర కళా నాట్యమండలి మహబూబ్ నగర్ వారు మునిసిపల్ టౌన్ హాల్ లో ఈనెల 2,3 వ తేదీ లలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి నాటక, సంగీత నృత్య ఉత్సవాలకు విశిష్ట అతిథిగా పాల్గొని పైవిధంగా సూచించారుఅలాగే సంస్కార. భారతి షాద్ నగర్ చిన్నారులు టీ. వీ. రంగయ్య రచన దర్శకత్వం లో ప్రదర్శించిన మాకూ స్వాతంత్య్రం కావాలి బాలల నాటిక ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని. చేసింది చిన్నారులు ప్రతి పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల అభిమానాన్నిచూరగోన్నారు.ఇందులో పి. వర్షిణి, వేదశ్రీ, యస్విత యోషిత సింధు, బిందు వైష్ణవి,కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు చిన్నారులకు అభినందనలలు తెలియజేశారు.చిన్నారులు శివ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్యాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో పెద్దలు బాడ్మి శివ కుమార్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ చంద్ర మౌళి మాజీ ఎం. ఆర్. ఓ జగపతి రావు మాజీ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫిసర్ శ్రీ మిత్ర కళా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ మాజీ ఎం.పిడి. ఓ. శ్రీ ప్రభాకర్ చారి విశ్రాంత ఫారెస్ట్ ఆఫీసర్ కళాకారులుమిగతా పెద్దలు పాల్గొన్నారు
