Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చు ఐటిడిఏ పిఓ రాహుల్

కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చు ఐటిడిఏ పిఓ రాహుల్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 పొనకంటిఉపేందర్ రావు


గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థిని, విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బాలికలు 808 మంది పరీక్షలు రాయగా 621 బాలికలు పాసయ్యారని,187 మంది ఫెయిలయ్యారని, 76.87 పర్సంటేజ్ రావడం జరిగిందని, గత సంవత్సరం బాలికలు 74.65% పాస్ అయ్యారని, ఈ సంవత్సరం బాలురు 511 మంది పరీక్ష రాయగా 327 మంది పాసయ్యారని, 184 మంది ఫెయిలయ్యారని 63.99 పర్సంటేజ్ వచ్చిందని, గత సంవత్సరం 63.46 శాతం ఉందని, ఓవరాల్ గా 1319 పరీక్షలు రాయగా 948 మంది బాల బాలికలు పాసయ్యారని 371 మంది ఫెయిలయ్యారని,71.87% వచ్చిందని అన్నారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖమ్మం రీజియన్ లో టాపర్స్ సి ఓ ఈ బాలికలు భద్రాచలం దివ్య ఎంపీసీ 463 మార్కులు, సి ఓ ఈ దమ్మపేట జయ అఖిల్ ఎంపీసీ 462 మార్కులు, ఎస్ ఓ ఈ ఖమ్మం బాలురు జస్వంత్ ఎంపీసీ 462, చరణ్ బైపిసి 427, యశ్వంత్ బైపిసి 427, తరుణ్ బైపిసి 427, సి ఓ ఈ భద్రాచలం పి. దివ్య బైపిసి 426,యు ఆర్ జె సి బాలికలు సుదిమల్ల పి శివ జ్యోతిక సిఇసి మార్కులు, టీ వెన్నెల హెచ్ఈసి 494 మార్కులు వచ్చాయని అన్నారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరములో బాలికలు 757 మంది పరీక్షలు రాయగా 645 మంది పాసయ్యారని, 112 మంది పేలయ్యారని 85. 20 పర్సంటేజ్ వచ్చిందని, గత సంవత్సరం 84.45 పర్సంటేజ్ ఉందని, బాలురు 480 మంది పరీక్షలు రాయగా 370 మంది పాస్ అయ్యారని 110 మంది ఫెయిలయ్యారని 77.08 పర్సంటేజ్ వచ్చిందని, గత సంవత్సరం 81. 26 శాతంగా ఉందని , ఓరాలుగా 1237 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా 1015 మంది పాసయ్యారని 222 మంది ఫెయిలయ్యారని 82.05 రిజల్ట్ వచ్చిందని అన్నారు.
ఖమ్మం రీజియన్ టాపర్స్ గా సి ఓ ఈ బాలురు కె ఎస్ డి సైట్ సంతోష్ ఎంపీసీ 986 మార్కులు, యు ఆర్ జె సి బాలికలు సుదిమల్ల ప్రవీణ ఎంపీసీ 984 మార్కులు,సి ఓ ఈ బాలురు దమ్మపేట ఉదయ్ ఎంపీసీ 984 మార్కులు, యు ఆర్ జె సి బాలికలు వైరా లేఖన బైపిసి 984 మార్కులు, సి ఓ ఈ బాలురు కె ఎస్ డి సైట్ శివ బైపిసి 974 మార్కులు, యు ఆర్ జె సి బాలికలు అన్నపురెడ్డిపల్లి శ్రీనిధి సిఇసి 979 మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారని ఖమ్మం రీజియన్ గురుకులం సమన్వయ అధికారి నాగార్జున రావు అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments