
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో
పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి,పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…నాయకులుగా మనం ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని,అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు. బీజేపీ బి ఆర్ ఎస్ జిల్లాకు చేసిందేమీ లేదు.ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగు నీరు అందాలని ప్యాకేజ్ 21,22,23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థల కొరకు ఆపినారు 300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టీ కాంట్రాక్టులకు ఇచ్చారు చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం జిల్లాలో క్రమపద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలు పండిస్తున్నాము అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం, భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది. ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్ మాట్లాడుతూ…
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే , ఎంపీ రాహుల్ గాంధీ , సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే విధంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ,క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ ని బలోపేతం చేయాలని పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న వారిని అబ్జర్వర్లుగా నియమించారు. జిల్లాకు కాంగ్రెస్ కార్యకర్తగా రావడం జరిగింది. జిల్లాలో అన్ని అసెంబ్లీ లలో పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించేవిదంగా సమావేశం నిర్వహించడం జరుగుతుంది
జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమనికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల నాయకులను సమన్వయం చేసుకొని ఎప్పుడూ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అనే విషయం పిసిసి ఆడియానికి తెలపాల్సి ఉంటుంది.
జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగిన విధంగా అన్ని అసెంబ్లీలో అందరూ నాయకులను కలుపుకొని మే 4 నుండి మే 10 తేదీ లోపు నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ నిర్వహిస్తున్నారూ అనేది తేదీలు తెలపాలి. పార్టీ కష్టపడ్డ వారిని గుర్తిస్తుంది రాష్ట్ర ఎస్ యు ఐ అధ్యక్షుడిగా పార్టీ ఆదేశాల మేరకు వేరే నియోజకవర్గం లో పనిచేశాను. ఎం.ఎల్.ఎ ఉపఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీ బలోపేతం కొరకు కస్టపడి పనిచేశాను. ఎస్ యు ఐ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశాను. పార్టీ రాష్ట్ర నాయకత్వం నా శ్రమను గుర్తించి నాకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది పార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచేది ఎవరు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి.కావున మనలో మనం కలిసి ఉండాలి పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. మండల అధ్యక్షులుగా 5 పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 3 పేర్లు ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. 2017 కన్నా ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వారికే ముందు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎవరినైనా అభ్యర్థిగా ఇచ్చే ముందు వారి మొత్తం అనుభవం,ఇప్పటివరకు పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేశారు మొత్తం రిపోర్ట్ ఇవ్వాలి ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి కారణమయ్యలో వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాము. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి ఈ కార్యక్రమంలో జై బాపు జై భీం జై సంవిధాన్ బోధన్ అర్బన్ ఇంచార్జి సత్యనారాయణ,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,రాష్ట్ర విత్తనబివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు,మాజీ MLC లు రాజేశ్వర్,అరికేలా నర్సారెడ్డి,ఆకుల లలిత,ఏనుగు రవీందర్ రెడ్డి,పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి చైర్మన్ తారా చాంద్,ఆర్మూర్ వినయ్ రెడ్డి,బాల్కొండ సునిల్ రెడ్డి,జావేద్ అక్రమ్,మరియు జిల్లా వివిధ అనుబంగ విభాగాల అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.