
మంచి పతకాలకు స్వాగతం పలుకుదాం..
నర్సింగపూర్ కాంగ్రెస్ నాయకులు..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( హుజురాబాద్)..
హుజురబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో సన్నాబియ్యం పంపిణి చేసారు.తెలంగాణ రాష్ట్రంలో పండిన సన్నబియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందామని నర్సింగపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. వినవంక మండలము లో నర్సింగపూర్ గ్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన నిరుపేదలకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని అమలు చేసారు.అనంతరం లబ్దిదారులకు సన్న బియ్యాన్ని పంపిణి చేసారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పథకాన్ని ప్రారంభించారని, మాట ఇచ్చిన ప్రకారం నిరుపేదలకు సన్న బియ్యం పతకం అమలు చేసారు, అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే మాట తప్పదు, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతరవేన సతీష్ కుమార్,గ్రామ నాయకులు కొండల్ రెడ్డి, సమ్మిరెడ్డి, కాజా, తిరుపతి, చంద్రమౌళి, సమ్మయ్య, సంపత్, గురువయ్య, రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
