
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు నవంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు షాద్నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత రెండు రోజుల నుంచి జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర శిక్షణా తరగతులో ఆయన రంగారెడ్డి జిల్లా రిపోర్టును ప్రవేశ పెడుతూ మాట్లాడారు భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలను పూర్తిస్థాయిలో ఇవ్వాలని మహిళలకు నెలకు 2500 ఇవ్వాలని మరియు వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచాలని గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టివాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పై ఐక్య పోరాటాలు నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా పోరాడుతామని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తమ సంఘంలో నిరంతర పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ తెలిపారు.