Monday, May 19, 2025
HomeUncategorizedకాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Listen to this article

కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

పయనించే సూర్యుడు న్యూస్ మే 19 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో కళాకారులదె కీలక పాత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు గజ్జి కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే – బాగోతాలేసిన బతుకు దెరువు లేనివాళ్ళమే, అంటూ నిరుద్యోగ కళాకారులు తమ బాధలను పాట రూపంలో వెలిబుచ్చారు, లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ యాదగిరిగుట్టలో ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర క్రియాశీలకమైనదని తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన వారి బతుకులు ఇంకా వెలుగు రాలేదని త్వరలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని రకాలుగా బీసీలే వెనుకబడి ఉన్నారని వారికి న్యాయం జరిగేలా చూస్తానని, త్వరలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని నిరుద్యోగుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు, ప్రముఖ సంఘ సేవకులు చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ తాను హైదరాబాద్ యూసుఫ్ గూడలో నిర్మించబోయే రికార్డింగ్ స్టూడియోలో నిరుద్యోగ కళాకారులకు ఉచితంగా రికార్డింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నానని, భవిష్యత్తులో సినిమా అవకాశాలు చూపిస్తానని ఆయన అన్నారు, ఏపూరి సోమన్న మాట్లాడుతూ భవిష్యత్తు ఉద్యమంలో తాను అడుగులో అడిగై ఉంటానని హామీ ఇచ్చారు, సభలో ముందుగా రాష్ట్ర నాయకులు దరువు అంజన్న మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కళ్ళ ముందు చూపించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,శ్రీనివాస్ గౌడ్ అన్నలను సీఎం అప్పాయింట్మెంట్ ఇచ్చేలా మీరు కృషి చేయాలని వారిని కోరారు, యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మీసాల గణేష్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అనుమోజ్ వెంకటేష్ , నగరగంటి కిరణ్ యాక్షన్ టీం సభ్యులు గజ్వేల్ ప్రతాప్, జువ్వాడి ప్రవీణ్, కొండ్ర కుమార్, పేరాల యాదగిరి,సలీం, రమేష్, నర్మదా, రమా, మట్టెడ కవిత, కరుణాకర్,శివశంకర్, హరికృష్ణ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించినటువంటి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనర్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments