బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మైపేర్ ఫంక్షన్ హాల్ మైనార్టీ సెల్ సమావేశం
పాల్గొన మాజీ మంత్రి మహమూద్ అలీ,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
శంషాబాద్ లోని మైఫైర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మైనార్టీ సెల్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మైనారిటీలకు ఈ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయచేయలేదని,గతంలో కెసిఆర్ మైనార్టీలకు అందించిన పథకాలను కూడా ఇవ్వకుండా మైనారిటీలను మోసం చేశారని,మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మైనారిటీలకు అన్ని రకాల పథకాలను అమలు చేసుకుందామని భరోసా కల్పించారు.ఈ సమావేశంలో మాజీ హోంమంత్రి మహామూద్ ఆలీ,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఇబ్రహీం మరియు షాద్నగర్ మైనారిటీ నాయకులు గౌస్ జానీ,అడ్డు, పర్వేజ్, నిజాం మరియు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


