
ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ పయనించే సూర్యుడు. ఏప్రిల్ 01
గార్లఓడ్డు ఎర్ర చెరువు సాగునీరు తాగునీరు అందిస్తా
సాగరు ఎడమ కాలపై మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కు కృషి చేస్తా
వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
దిశ, ఏన్కూర్, కాంగ్రెస్ ప్రభుత్వం లోనే రైతులు సుభిక్షంగా ఉన్నారని. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానిని కెసిఆర్ దోచుకున్నారని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. సోమవారం ఏనుకూరు మండల కేంద్రంలో నాగార్జునసాగర్ కెనాల్ పై గార్ల ఒడ్డు ఎర్ర చెరువుకు సాగునీరు తాగునీరు అందించేందుకు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం స్థలంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతు రుణమాఫీ, పేదలకు సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, తదితర పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, కెసిఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేదని, రైతులు రుణమాఫీని చేయకుండా కాలం గడిపాడని, కెసిఆర్ చేసిన మోసాలు ప్రజలు భరాంచారని ఆయన అన్నారు. గార్లఒడ్డు ఎర్రచెరువుకు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం వల్ల సుమారు 200 ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా గార్లఓడ్డు గ్రామానికి త్రాగునీరు దేవాలయానికి వచ్చే భక్తులకు నీటి అవసరాలకు తీర్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజా సమస్యల పరిష్కారం కనబడుతుందని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం అన్నారు. ఆయన వెంట ఏన్కూరు సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఏన్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యాలాలు నాయక్, ఏన్కూరు మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, కాంగ్రెస్ నాయకులు పూలబాల నరసింహారావు, బత్తిని కొండయ్య, సీతయ్య, మేడ ధర్మారావు, భువనేశ్వర్ రాజు, పంతగాని నరేష్, తదితరులు పాల్గొన్నారు
