
ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 28 అల్లూరి సీతారామరాజు
జిల్లా కూనవరం మండలంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పత్రిక ప్రకటన ద్వారా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో మరియు ఇతర శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం వారు ఇంత వరకు ఆ ఉత్తర్వులు ఇవ్వలేదని అన్నారు దీనివలన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ట్రెజరీ నుండి వచ్చే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు, కొనసాగింపు ఉత్తర్వులు లేకపోతే ట్రెజరీ వారు జీతాలు ఆపివేస్తే ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు మార్చి -2025 జీతాలు రాలేదు ఇప్పుడు ఏప్రిల్ నెల జీతం కూడా ఆగితే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉద్యోగం చేయాల్సి వస్తుందని అన్నారు, ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు కోసం కొన్ని యూనియన్ ల వారు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు మరియు ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగుల జీతాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా కోరుతున్నామని అన్నారు