
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 23//మక్తల్ శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్తల్ లో శనివారం రోజు మండల విద్యాధికారి అనిల్ గౌడ్ అధ్యక్షతన కాంప్లెక్స్ సమావేశం జరిగింది.ఈ కాంప్లెక్స్ సమావేశం లో మండల విద్యాధికారి అనిల్ గౌడ్ మాట్లాడుతూ ప్రతినెల జరిగే కాంప్లెక్స్ సమావేశాల్లో 50% ఉపాధ్యాయులు ఈరోజు మిగితా 50% ఉపాధ్యాయులు సోమవారం రోజు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ సమావేశాలవల్ల ఉపాధ్యాయులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని, వారిలో జిజ్ఞాసను కలిగిస్తాయని పేర్కొన్నారు.ప్రతి పాఠశాలలో ఆపార్ త్వరగా పూర్తి చేయాలని, అపార్ ద్వారా విద్యార్థుల సమగ్ర విషయాలు పొందుపచవచ్చని పేర్కొన్నారు.అనతరం మక్తల్ మండలంలో బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్, టీచర్ల గురించి వివరిస్తూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలలో మౌనిక వసతులు కల్పించాలని,పరీక్షలు దగ్గర్లో ఉన్నదున విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కోరడం జరిగింది. సమావేశంలో కర్నే, జక్లేర్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్ , చంద్రకళ గార్లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి దవడం,రాయడం,చతుర్విధ ప్రక్రియలు రావాలని విద్యార్థులు ఏ విషయాల్లో వెనుకబడుతున్నాడో తెలుసుకుని వారికి అనుగుణంగా బోధన చేయాలని ,ప్రతి పాఠశాల ఉపాద్యాయులు గోల్ సెట్టింగ్ అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు.ఈ సమావేశం లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది