
ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో రంపచోడవరం ITDA ముట్టడి.
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 21
ఈనెల 11వ తేదీన వై రామవరం మండలం జాజిగడ్డ గ్రామానికి చెందిన కాకూరి పార్వతి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనపై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నాడు రంపచోడవరం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఆదివాసి బిడ్డ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని పార్వతి ప్రసవం సమయంలో వైద్యులు తక్షణమే స్పందించి ఉంటే పార్వతి మరణించి ఉండేది కాదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రసవం చెందిన తర్వాత కొంతమందికి రక్తస్రావం అవటం సహజమే అని అయితే మొదటి కాన్పు సహజంగా జరిగినప్పుడు రెండవ కాన్పులు రక్తస్రావం సంఘటన ఎందుకు చోటుచేసుకుందని ఆయన వైద్యులను ప్రశ్నించారు. పార్వతికి అటువంటి ప్రాబ్లం ఉండి ఉంటే మొదటి ప్రసవంలో కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కదా రెండవ కాన్పులు మాత్రమే ఎందుకు జరిగిందని ఆయన అన్నారు. పార్వతి మరియు ఆమె భర్త ముందు నుండి సహజ ప్రసవం జరిగే పరిస్థితి లేకపోతే ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయండి అని బ్రతిమిలాడుకున్నారని ఆయన ఆస్పటల్ వర్గాలు వారి విన్నపాన్ని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. 11వ తేదీన పార్వతికి పురిటి నొప్పులు ప్రారంభమైనప్పుడు అందుబాటులో వైద్యులు లేరని వైద్యులు వచ్చే సమయానికి పార్వతి పురుషులు భరించలేక స్పృహను కోల్పోయిందని, ఆ సమయంలో డెలివరీ ప్రాసెస్ జరుగుతుందని బిడ్డ మధ్యలోనే స్టక్ అవడం వలన లేటుగా వచ్చిన వైద్యురాలు బిడ్డని బలవంతంగా బయటికి లాగేయడంతో తీవ్ర రక్తస్రావం కలిగి కొద్దిసేపటికి పార్వతి మృతి చెందిందని ఈ విషయాన్ని వెంటనే తన భర్త దుర్గాప్రసాద్ కు వైద్యులు వెల్లడించలేదని ఆయన మండిపడ్డారు. పార్వతి మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి వారికి అనుకూలంగా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి భర్త శాత సంతకం చేయించి చనిపోయిన పార్వతిని భర్త చేతిలో ఉంచారని, ఆ సమయంలో ఏం చేయలేని భర్త దుర్గాప్రసాద్ నిస్సహాయ స్థితిలో మృతి చెందిన తన భార్య మృతి దేహాన్ని దుఃఖంతో తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. మృతి చెందిన తర్వాత వైద్యుల నిర్లక్ష్యం లేనప్పుడు వైద్యులు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈ విషయం ఎందుకు ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చిందని ఆయన అధికారులను ప్రశ్నించాడు. ఆస్పత్రిలో ఉండే సిబ్బంది మధ్య కూడా సఖ్యత లేదని దీని మూలాన ఆసుపత్రిలో రెండు వర్గాలు ఏర్పడి వైద్యం కోసం వచ్చిన ఆదివాసులను చంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు పార్వతి బిడ్డ తల్లి లేని అనాధగా మారిపోయిందని తల్లి లేని లోటుని తండ్రి పూడ్చలేడని, తండ్రి దుర్గాప్రసాద్ కూడా తమ సంఘంతో మాట్లాడుతూ నాకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని దుఃఖాన్ని వెల్లడించినట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయంపై తక్షణమే వైద్యుల్ని సస్పెండ్ చేసి వారిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐటీడీఏ పీవో సింహాచలం వారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. బాధ్యులపై చర్య తీసుకోకుంటే ఆదివాసి సంక్షేమ పరిషత్ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని పిఓ గారికి తెలియజేశారు, ఈ విషయంపై స్పందించిన పి ఓ గారు దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు సంక్షేమ పరిషత్ నాయకులు తెలియజేశారు. అనంతరం నరసాపురం మెటల్ క్వారీపై ఫిర్యాదు చేయడం జరిగింది, మెటల్ వారిపై 15 రోజుల్లో నివేదిక అందజేయాలని సబ్ కలెక్టర్ వారికి PO ఆదేశాలు జారీ చేశారు. నాన్ ట్రైబల్స్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకోవాలని మరియు అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని ఆదేవ శంఖం పరిస్థితి నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా స్పందిస్తూ సబ్ కలెక్టర్ కి అన్ని రకాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని సంక్షేమ పరిషత్ నాయకులు తెలియజేశారు. అనంతరం ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ పి ఓ గారు హామీ అనుసారం ప్రస్తుతం ఈ ఆందోళన విరమిస్తున్నామని పిఓ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయవలసిన అవసరం ఉందని దీనికి ప్రతి ఒక్క ఆదివాసి కలిసి రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్తు జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు మోడిగ నూకరాజు, ఆదివాసి చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు లచ్చిరెడ్డి, ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ఉపాధ్యక్షురాలు దొరగా ఎర్రమ్మ, , డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్, నాయకులు పురుషోత్తం, మల్ల సత్యనారాయణ, కడపల కాసులమ్మ, అబ్బాయి దొర, కారు నాగరాజు, నర్సాపురం గ్రామస్తులు, మామిడి చిన్నారెడ్డి సరంపెటా గ్రామస్తులు, బోలుకొండ గ్రామస్తులు, గడిచిన్నయపాలెం గ్రామస్తులు, పెద్ద మునకన, చిన్న మునకన గడ్డ గ్రామస్తులు, పనుకురాతి పాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
