Sunday, April 20, 2025
Homeతెలంగాణకాప్రా సర్కిల్ లో 76 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు.

కాప్రా సర్కిల్ లో 76 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు.

Listen to this article

పయనంచేసూర్యుడు,జనవరి 26,కాప్రా ప్రతినిధి సింగం రాజు:- కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 76 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలను కాప్రా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలోనిర్వహించారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ జగన్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు భారత దేశ స్వాతంత్ర్య కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న స్వాతంత్ర్య భారత దేశంలో ప్రజలందరూ సమాన హక్కులు పొందాలని ధర్మ పాలన జరగాలని, మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనంగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నేటి రోజున 1950 జనవరి 26 న భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజున డా.బి ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి,భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం దేశాల్లో ముందు నిలిచిన సందర్భంగాప్రతిచోటా దేశభక్తి వెల్లివిరిసే విధంగా నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. కార్పొరేటర్లు స్వర్ణరాజ్ శివమణి,శిరీష సోమశేఖర్ రెడ్డి,బొంతు శ్రీదేవి యాదవ్, ప్రభుదాస్,మాజీ కార్పొరేటర్లు, కొత్త రామారావు,పాజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, గొల్లూరు అంజయ్య,శ్రీనివాస్ రెడ్డి,వివిధ పార్టీ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుసింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి,బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మర్రి మోహన్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ళ బాల్రెడ్డి,కాసం మైపాల్ రెడ్డి,సింగిరెడ్డి వెంకట్రెడ్డి, సీతారాం రెడ్డి,పెద్దాపురం కుమార్ స్వామి, ప్రభు గౌడ్,మల్లేష్ వంశరాజ్, పవన్ కుమార్,నాగ శేషు, బేతాళ బాల్రాజ్,మురళి పంతులు,చిందం బాల నరసింహ వంశరాజ్,నాగేశ్వర్రెడ్డి,ఎస్ ఏ రహీం,మధుకర్ రెడ్డి, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.జిహెచ్ఎంసి అధికారులుసానిటేజర్ సూపర్వైజర్ సుదర్శన్,జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments