
పయనించే సూర్యుడు మే19 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, ఆదర్శ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్బంగా సిపిఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సుందరయ్య స్థూపం వద్ద జెండా ఆవిష్కరించిన సిపిఎం సీనియర్ నాయకులు రాజమౌళి, చిత్ర పటానికి పూల మాల వేసిన జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి,సీనియర్ నాయకులు ఎండీ అబ్బాస్ అనంతరం నూతన పార్టీ సభ్యుల ప్రమాణం అనంతరం జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబి,మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ మాట్లాడుతూ అత్యంత ఆదర్శవంతమైన నాయకులలో అగ్రగామి పుచ్చలపల్లి సుందరయ్య. రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా ఆయనను అభిమానించేవారు రాష్ట్రంలో అనేకమంది ఉన్నారని . జాతీయ స్థాయిలో సైతం యవ్వనంలోనే ఉన్నత విలువలు పాటించి నెహ్రూ లాంటి వారి అభిమానాన్ని సైతం చూరగొన్న వ్యక్తి. తనతో రాజకీయంగా విబేధించేవారిని సైతం ఆయన గౌరవించేవారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యక్ష సారధ్యం వహించిన సుందరయ్య భారతదేశ విముక్తికి మార్గం చూపారనివారు
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, సుల్తానా,అబ్బాస్, ఆలేటి సంధ్య,మాదారపు వెంకటేశ్వర్లు, మరియ,ఖాదర్, కోడెం బోస్, మహమూడ్,తాళ్లూరి పద్మ,జైబున్నిసా, సత్యనారాయణ కోరి,నాగరాజు, వజ్జా సురేష్, వెంకన్న, సంతోష, శ్రీను,రాజు తదితరులు పాల్గొన్నారు.