
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 12
రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 244, 5 (2) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీ హక్కులు,చట్టాలకు విరుద్ధంగా మరియు
రాష్ట్రాలు గాని జిల్లాలు గాని మండలాలు గాని విభజన చేయాలంటే రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.ఈ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో కొత్త జిల్లాల వీలినం పై వైరల్ అవుతున్న విషయంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్వష్టత ఇవ్వాలన్నారు.రంపచోడవరం నియోజకవర్గం లోని వై.రామవరం మండలాన్ని రెండు మండలాలుగా విభజించడానికి హర్షిస్తున్నామన్నారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసినప్పటి నుండి ఆదివాసీల అభివృద్ధి,సంక్షేమం పై దృష్టి పెడుతున్న సమయంలో మరల కొత్త జిల్లాల విభజన త్వరలో ప్రారంభం అవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు.ఇదే నిజమైతే రంపచోడవరం నియోజకవర్గం లోని ఏజెన్సీ మండలాలు మరియు పోలవరం ఏజెన్సీ మండలాలు కలిపి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి అమరవీరులయ్యారన్నారు.అలాగే మొట్టమొదటి ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు1839 సంవత్సరంలో రంపచోడవరం కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారితో పోరాడిన పోరాట యోధుడు కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.