
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.10/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కారిపాకం జడ్పీ,హెచ్ ఎస్ హైస్కూల్ పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కారిపాకం సర్పంచ్, ఆనంద్ ఎస్ఎంసి నెంబర్, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ హెడ్మాస్టర్ ఆయన రవీంద్ర రెడ్డి విద్యార్థి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ముందుగా జడ్పీ హెచ్ ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులచేత నృత్య ప్రదర్శనవేసి, తల్లిల చేత రంగోలి కాంపిటేషన్ ను ప్రోగ్రాం ని ఏర్పాటు చేసి ప్రధమ,ద్వితీయ, తృతీయ, గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం పిల్లలకు తల్లల గొప్పదనంతో పాటు తల్లికి వందనం పథకం గురించి తెలియజేసేలా హైస్కూల్ స్టేజ్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తల్లి వందనం బాలికలు గూరించి అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులకు తెలియజేశారు, ఈ సందర్భంగా స్కూల్ హెడ్మాస్టర్ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రుల స్పష్టంగా విద్యార్థుల విద్యా ప్రగతి, అభిరుచి, ప్రవర్తన, ఆరోగ్యం హాజరు మొదలైన అంశాలతో కూడిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ జిగ్ను ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. వారి మార్కులను అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇంకా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్ కు గైర్హాజరైన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఆగష్టు నుంచి మెసేజ్ రూపంలో తెలియజేయజేస్తామని హై స్కూల్ హెడ్మాస్టర్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారిపాకం సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు తదుపరులు పాల్గొన్నారు.