{పయనంంచే సూర్యుడు} {అక్టోబర్ 25} మక్తల్
నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో సుప్రసిద్ధ జాంబవంత ప్రతిష్ఠాపిత పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 1,2, 3 తేదీలయందు మూడు రోజుల పాటు ఉడుపి పేజావర మఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ కె రాఘవేంద్రాచార్య చే వాల్మీకి సుందరకాండ ప్రవచనం జరుగును.
ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు, భజన పరులు, భక్తులందరూ పాల్గొని పడమటి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి.
సమయం సాయంత్రం 6-00 నుండి 7-30 వరకు ప్రవచనం తర్వాత దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది.సూచన :- ప్రారంభంలో 30 నిమిషాలకు ముందు రాగలరు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ నారాయణపేట జిల్లా సాహ సంయోజక్ భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, సహ సంయోజక్ శివ, మండల గోరక్ష సంయోజక్ శ్రీను, పరుశురాం ఇతరతులు పాల్గొన్నారు*విశ్వహిందూ పరిషత్ – భజరంగ్ దళ్ పడమటి ఆంజనేయ స్వామి భక్తబృదం మఖ్తల్


