
పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
బనగానపల్లె మండలం పసుపల గ్రామ కొండల్లో వెలిసిన శ్రీ గుండం మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే కార్తీక మాసోత్సవాలకు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు గ్రామస్తులు మంగళవారం బిసి రాజారెడ్డి చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను విడుదల చేయించారు. ఈనెల 17వ తేదీన కార్తీక కడ సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం, అంతర్రాష్ట్ర , రాష్ట్రస్థాయిలో ఆరుపండ్ల విభాగంలో వృషభరాజముల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కార్తీకమాస ఉత్సవాల్లో పాల్గొని గుండ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవాలని వారు బిసి రాజారెడ్డి కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు భూషన్న, ఆలయ చైర్మన్ సిద్ధేశ్వరప్ప, షేక్షావ లి, బాల నాయుడు, మధుసూదన్ నాయుడు, ఓబులేసు, తిరుపతి నాయక్, జయ నాయక్, అశోక్ నాయక్ పాల్గొన్నారు.