
పయనించే సూర్యుడు// న్యూస్ మే 8//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ మండలంలోని కర్ని పి హెచ్ సి మెడికల్ అధికారి కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. శతాబ్ది కాలం నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి, కొన్నింటిని రద్దుచేసి యజమానులకు అనుకూలంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని కోరుతు మే 20న జరిగే సమ్మెలో ఆశా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనబోతున్నట్లు మక్తల్ మండలంలోని పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ తిరుపతి కి గురువారం రోజు ఆశలు సమ్మె నోటీసు అందజేశారు ఈ సందర్భంగా ఆశ యూనియన్ జిల్లా నాయకురాలు గోవిందమ్మ సిఐటి జిల్లా సహకార దర్శి గోవిందరాజ్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించడం ,సంఘం పెట్టుకొని సంఘటితంగా పోరాడే రాజ్యాంగపు హక్కును కాదనడం తదితర అనేక కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మే 20న జరిగే దేశవ్యాప్త కార్మిక కర్షక జాతీయ సమ్మెలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మండల కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేయాలని కోరారు .ప్రభుత్వాల విధానాల వల్ల కార్మికులకు రైతులకు ప్రజలకు నష్టం కలిగిస్తే ఉద్యమించడమే మార్గం తప్ప మరొకటి లేదని తెలిపారు.
లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకు పారిశ్రకవేత్తలకు రునమాఫీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు 24 గంటల పాటు వైద్య సదుపాయాలు ప్రజలకు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు .కార్మిక కర్షక సమ్మెతో నైనా ప్రభుత్వాలు దిగివచ్చి కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకురాలు యశోద, అమ్మిన బేగం, ఇందిరా, అనిత, సుజాత,రాధిక, సావిత్రమ్మ, లక్ష్మి, మహేశ్వరి, పార్వతమ్మ, వెంకట్ లక్ష్మి, వెంకటమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు